ఎన్టీఆర్ కెరీర్ లోనే స్పెషల్ సాంగ్

17
- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కలయికలో రాబోతున్న క్రేజీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ దేవర గురించి లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో ఓ పాట కోసం ఏకంగా రూ.7 కోట్ల ఖర్చు పెడుతున్నారు. ఎన్టీఆర్ సినీ కెరీర్ లోనే ఒక పాట కోసం ఈ స్థాయిలో ఖర్చు పెట్టడం ఇదే మొదటిసారి. ఈ పాట కోసం ఇప్పటికే రామోజీ ఫిల్మ్‌ సిటీలో భారీ సెట్‌ వేసారు. గంగాదేవి పై సాగే ఈ గీతంలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కనిపించబోతున్నారు. మరి ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యధిక వ్యయంతో తెరకెక్కుతున్న ఈ పాట ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. ఏది ఏమైనా ఎన్టీఆర్ కెరీర్ లోనే ఇది స్పెషల్ సాంగ్ గా నిలవబోతుంది.

ఈ సినిమా దసరాకి రాబోతుంది. ఆర్ఆర్ఆర్ అఖండమైన విజయం త‌ర‌వాత‌.. ఎన్టీఆర్ తిరుగులేని ఫామ్ లోకి వ‌చ్చేశాడు. ఆ స్థాయిలో ఆర్ఆర్ఆర్ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్లు సాధించింది. పైగా, ఎన్టీఆర్ పేరిట కొత్త రికార్డులను కూడా సృష్టించింది. దీనికితోడు ఎన్టీఆర్ చేసిన అరవింద సమేత సినిమా కూడా భారీ విజయాన్ని సాధించింది. మరి కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ దేవర సినిమా ఏ రేంజ్ హిట్ ను సాధిస్తోందో చూడాలి. డెడ్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ కోసం పాన్ ఇండియా రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి.

అందుకే, దేవర చిత్రం కోసం ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్నట్టు ఇక దేవర సినిమా సముద్రం నేపథ్యంలో జరుగుతుంది. రివెంజ్ డ్రామాగా ఈ సినిమా కథను కొరటాల శివ తన మార్క్ ఉండేలా కథని రాసుకున్నారట. పైగా దేవర కథ కోసం కొరటాల శివతో పాటు మరో ముగ్గురు రచయితలు కూడా కథ పై కసరత్తులు చేశారు. ముఖ్యంగా ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీఖాన్ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందట.

Also Read:Modi:తెలంగాణకు మోడీ.. క్లారిటీ వచ్చేనా?

- Advertisement -