గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ పోస్టర్‌..

152
Pakka Commercial Movie
- Advertisement -

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ ప్రస్తుతం ‘పక్కా కమర్షియల్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈచిత్రాన్ని డైరెక్టర్‌ మారుతి రూపొందిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్.. గీతా ఆర్ట్స్ 2 వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కరోనా ప్రభావం కారణంగా ఈ సినిమా షూటింగ్‌ నిలిచిపోయింది. త్వరలోనే చిత్రీకరణకి సంబంధించిన పనులు ఊపందుకోనున్నాయి. అయితే జూన్‌ 12న ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ శుభాకాంక్షలు అందజేస్తూ, స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ లో మాంఛి జోష్‌తో స్టెప్పులు వేస్తూ, మరింత హ్యాండ్సమ్‌గా గోపీచంద్ కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన నాయికగా రాశి ఖన్నా కనిపించనుంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘జిల్’ విజయాన్ని అందుకుంది. అలాగే మారుతీ దర్శకత్వంలో రాశి ఖన్నా చేసిన ‘ ప్రతి రోజూ పండగే’ సినిమా కూడా ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై కూడా ఆమె గట్టిగానే ఆశలు పెట్టుకుంది. కొంతకాలంగా గోపీచంద్ సరైన హిట్ లేకుండా ఉన్నాడు. ఈ సినిమాతో తన నిరీక్షణ ఫలిస్తుందని ఆయన భావిస్తున్నాడు.

- Advertisement -