- Advertisement -
పదవీకాలం పూర్తవుతున్నందున రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 14వ తేదీతో వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల పదవీ కాలం పూర్తికానుంది. అదేవిధంగా ఈ నెల 14వ తేదీతో అచ్చంపేట, ఏప్రిల్ 15వ తేదీతో సిద్దిపేట మున్సిపాలిటీ పదవీకాలం పూర్తికానుంది.
ఈ నేపథ్యంలో వరంగల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా వరంగల్ అర్బన్ కలెక్టర్‌ను, ఖమ్మం కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా ఖమ్మం కలెక్టర్‌ను, అచ్చంపేట మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా నాగర్‌కర్నూల్ అదనపు కలెక్టర్‌ను, సిద్దిపేట మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సిద్దిపేట కలెక్టర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త పాలకమండలీలు ఏర్పాటు అయ్యే వరకు ఈ ప్రత్యేక అధికారులు కొనసాగనున్నారు.
- Advertisement -