పెళ్లి సందD @ 50 మిలియన్ వ్యూస్

74
pelli sandadi

శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరీ రోణం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పెళ్లిసందD. ఆర్కే ఫిల్మ్ అసోసియేట్ .. ఆర్కా మీడియా ఈ సినిమాను నిర్మించగా ఈ సినిమాతో శ్రీలీల కథానాయికగా పరిచయమవుతోంది.

రాఘవేంద్రరావు ఒక ప్రత్యేకమైన పాత్రను పోషించిన ఈ సినిమా నుంచి, మహేశ్ బాబు చేతుల మీదుగా ఒక ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది.

ట్రైలర్ యూట్యూబ్‌లో 5 మిలియన్+ వ్యూస్ దాటింది. మేకర్స్ ట్విట్టర్‌లో కొత్త పోస్టర్‌ను విడుదల చేసి ఈ విషయాన్ని ప్రకటించారు. శ్రీనివాస్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, షకలక శంకర్, ఫిష్ వెంకట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ సునీల్ కుమార్ నామా నిర్వహించగా, తమ్మిరాజు ఎడిటింగ్ చేస్తున్నారు.