ఉభయసభలను పరిశీలించిన స్పీకర్ పోచారం,గుత్తా

171
speaker pocharam
- Advertisement -

శాసనసభ, శాసనమండలి సమావేశ మందిరాలను ఈరోజు పరిశీలించారు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ,శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 7 నుంచి శాసనసభ, మండలి సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు స్పీకర్ పోచారం , చైర్మన్ గుత్తా , మంత్రి వేముల , లెజిస్లేచర్ సెక్రటరీ డా. వి. నరసింహా చార్యులు గారితో కలిసి అసెంబ్లీ సమావేశ మందిరాన్ని, మీడియా, విజిటర్స్ గ్యాలరీని, స్పీకర్ గారి ఛాంబర్ , శాసన సభ్యుల ప్రవేశ ద్వారాన్ని, శాసనమండలిని పరిశీలించారు.

సభ లోపల భౌతిక దూరం పాటించే విధంగా సభ్యులకు సీట్లను ఏర్పాటు చేయాలనే అంశంపై వివిధ కోణాలలో సీటింగ్ ఏర్పాట్లను ముఖ్యులు పరిశీలించారు. ఏర్పాట్లపై తీసుకుంటున్న చర్యలను సెక్రటరీ గారు స్పీకర్, చైర్మన్, మంత్రి గారికి వివరించారు.ఈ సందర్భంగా సభ లోపల సభ్యులు కూర్చునే సీట్లకేటాయింపు , విషయాలు,కరోన సోకకుండా తీసుకునే తగు జాగ్రత్తల తీసుకోవలసిన అవసరంతో పాటుగా, సమావేశాలలో సభ్యులకు సౌకర్యవంతంగా ఉండి సమావేశాలలో యాక్టివ్ గా పాల్గొనే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పీకర్ పోచారం గారు, చైర్మన్ గుత్తా, మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు లెజిస్లేటివ్ సెక్రటరీ, వివిధ శాఖల అధికారులకు సూచించారు.సెప్టెంబర్ ఒకటో తేదీ నాటికి ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.

అదేవిధంగా కరోన లక్షణాలు ఉన్న సభ్యులను, వ్యక్తులను గుర్తించే విధంగా అసెంబ్లీ, మండలి బయట, లోపల ఏర్పాటు చేసిన అధునాతన పరికరాల పని తీరుని అసెంబ్లీ స్పీకర్,మండలి చైర్మన్ గార్లకు అధికారులు చూపించారు.కరోన మహమ్మారి నేపధ్యంలో నిర్వహిస్తున్న ఈ సమావేశాలు ప్రత్యేకమైనవి. ఎట్టి పరిస్థితుల్లోనూ జాగ్రత్తగా వ్యవహరించాలని, అదేసమయంలో సమావేశాలకు హాజరయ్యే శాసన సభ, మండలి సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు అభిప్రాయపడ్డారు.గౌరవ సభ్యులు, అధికారులు, మీడియా ప్రతినిధులు కూడా ఈ ప్రత్యేక పరిస్థితులలో సహకరించాలని కోరారు.

- Advertisement -