- Advertisement -
శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా వైరస్ సోకిందని నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. బుధవారం సాధారణ పరీక్షల్లో భాగంగా కరోనా టెస్టు చేయగా, అందులో ఆయన పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం పోచారం వైద్యుల సూచనల మేరకు ఆసుపత్రిలో చేరానని తెలిపారు. గత కొన్నిరోజులుగా తనను కలిసిన వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలతో హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని పోచారం సూచించారు.
- Advertisement -