మోడీ..అట్టర్ ఫ్లాప్: సుబ్రమణ్యస్వామి

30
subramanya

ప్రధానమంత్రి నరేంద్రమోడీపై విమర్శలు గుప్పించారు ఆ పార్టీ ఎంపీ సుబ్రమణ్యస్వామి. అన్నింటిలోనూ మోడీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఆర్థిక వ్యవస్థ, సరిహద్దు భద్రత, విదేశీ వ్యవహారాలు, అంతర్గత భద్రత వంటి విషయాల్లో మోదీ ప్రభుత్వం విఫలమైందన్న సుబ్రహ్మణ్యస్వామి.. ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభ విషయంలో కేంద్రం వ్యవహరించిన తీరును అపజయంగా అభివర్ణించారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని జయప్రకాశ్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, రాజీవ్ గాంధీ, చంద్రశేఖర్, పీవీ నరసింహారావు వంటి రాజకీయ దిగ్గజాలతో పోల్చారు. ఆమె చెప్పిందే చేస్తారని, చేసేదే చెబుతారని రాజకీయాల్లో ఇలాంటి గుణం చాలా అరుదని కీర్తించారు.