కరోనా మందులు లేని మహమ్మారి- స్పీకర్ పోచారం

199
Speaker Pocharam Srinivas Reddy On Coronavirus
- Advertisement -

కరోనా మహమ్మారిని రూపుమాపేందుకు నిరంతరంగా శ్రమిస్తున్న బాన్సువాడ నియోజకవర్గంలోని ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, నర్సులకు, పోలీస్ కానిస్టేబుల్ లకు, మున్సిపల్ సిబ్బందికి, గ్రామ పంచాయతీ సిబ్బంది, జర్నలిస్టులకు పోచారం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత బియ్యం, అత్యవసర సరుకులను అందజేశారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ కార్యక్రమంలో డి సి బి సి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. కరోనా వ్యాధి మందులు లేని మహమ్మారి. దీనిని రూపుమాపేందుకు యావత్తు ప్రపంచం శ్రమిస్తుంది. అయినా మందు దొరకడం లేదు. స్వీయ నియంత్రణే ఈ వ్యాధికి మందు. ప్రజలందరూ లాక్‌డౌన్‌కు సహకరించాలని కోరారు.

రాష్ట్రంలో ఏ ఒక్క నిరు పేద ఆకలితో అలమటించ కూడదని లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉచిత బియ్యం,1500 రూపాయల నగదు, కందిపప్పును అందజేయడం జరుగుతుంది.ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నిర్మూలన కొరకు ముందస్తు చర్యలు చేపట్టడం వల్లే రాష్ట్రంలో కేసులు తగ్గుముఖం పడుతున్నాయ. ప్రపంచం కనపడని శత్రువుతో పోరాటం చేస్తోందని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

- Advertisement -