పేదరికాన్ని నిర్మూలించడమే నిజమైన అంబేద్కరిజం: స్పీకర్

66
Ambedkar
- Advertisement -

దేశంలో పేదరికాన్ని నిర్మూలించడమే నిజమైన అంబేద్కరిజం అన్నారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. అంబేద్కర్ జయంతి సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన స్పీకర్.. అంబేద్క‌ర్ ఆశ‌యాల‌కు అనుగుణంగా తెలంగాణ అభివృద్ధి దిశ‌లో ప‌య‌నిస్తోంద‌న్నారు. ఈ దేశం సీఎం కేసీఆర్‌ను కోరుకుంటోంద‌ని బీజేపీ ఎంపీ సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి లాంటి వారే చెప్తున్నార‌ని చెప్పారు.

ఈ దేశంలో ఫెడ‌ర‌ల్ వ్య‌వ‌స్థ దెబ్బ‌తింటోంద‌ని, దాన్ని కాపాడాల్సిన అవ‌స‌రం ఉంద‌ని శాస‌న మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఈ దేశానికి అంబేద్క‌ర్ ఒక స్ఫూర్తిని అందించార‌ని తెలిపారు. పేద ప్ర‌జ‌ల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నారు. రైతుబంధు, ద‌ళిత బంధు లాంటి ప‌థ‌కాలు తీసుకొచ్చార‌ని పేర్కొన్నారు.

- Advertisement -