ప్రజలకు పార్లమెంట్, అసెంబ్లీలు ప్రతీకః పోచారం

283
Speaker Pocharam
- Advertisement -

పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన ఢిల్లీలోని పార్లమెంట్ ప్రధాన కమిటీ సమావేశ హాల్‌లో అన్నీ రాష్ట్రాల స్పీకర్లతో సమావేశం జరిగింది. ఈసమావేశంలో తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి డా. నరసింహాచార్యులు పాల్గోన్నారు. ఈసందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ…

ఇటువంటి సమావేశాలు చట్టసభల మెరుగైన నిర్వాహణకు ఎంతో ఉపయోగం. 130 కోట్ల మంది దేశ ప్రజలకు పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు ప్రతీకగా నిలుస్తున్నాయి. దేశ ప్రజలకు మరింత మెరుగైన పాలన, సంక్షేమం‌, అభివృద్ధి కొరకు తీసుకోవాలసిన అంశాలపై నిర్ణయాత్మక చర్చలు జరిగేది చట్టసభలలోనే. తమ మేలు కోసం చట్టసభలలో జరిగే చర్చలపై దేశ ప్రజలు ఆసక్తి చూపుతారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న చట్టసభల సమావేశాలలో ఒక్క నిమిషం, ఒక్క పదం కూడా వృదా కారాదు.

సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఆ అంశం పరిధిలోనే ఉండాలి. అంతేకానీ చర్చ పక్కదారి పట్టకూడదు. వ్యక్తిగత విమర్శలు, దూషణలతో సమయం వృదా అవుతుంది. చట్టసభలలో అల్లరి చేయడం ద్వారా మీడియాను ఆకర్షించేందుకు కొంతమంది సభ్యులు ప్రయత్నం చేయడం దురదృష్టం, దీనిని కట్టడి చేయాలని తెలిపారు.

అప్పుడే అర్ధవంతమైన చర్చలు జరుగుతాయి. తెలంగాణ శాసనసభలో రోజుకు 10 ప్రశ్నలతో కూడిన క్వశ్చన్ అవర్ ఉన్నది.ఇటువంటి సమావేశాలు మరిన్నీ జరగడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చాన్నారు. అయితే సమావేశ అజెండా, సమస్యలపై సూచనల కొరకు ముందస్తుగానే సమాచారం అందిస్తే సభ్యులు మెరుగైన పరిష్కారాలతో హాజరవుతారని సూచించారు.

- Advertisement -