ఎస్ పి బాలసుబ్రమణ్యం ప్రస్తుతం తన పాటల ప్రస్థానానికి 50 ఏళ్లు పూర్తి కావడంతో..ఆయన ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ సుమధురమైన పాటలను ఆలపిస్తున్నారు. రష్యా.. సింగపూర్.. శ్రీలంక.. దుబాయ్.. మలేషియా సహా అనేక దేశాల్లో ప్రత్యేకమైన మ్యూజిక్ కాన్సర్ట్ లలో.. చిత్ర.. చరణ్ లతో కలిసి గానామృతాన్ని పంచుకున్నారు. కానీ కొన్ని రోజుల క్రితం ఎస్పీబీకి లీగల్ నోటీసులు పంపారు మ్యూజిక్ మాస్ట్రో. బాలసుబ్రమణ్యం టూర్ లో తన అనుమతి లేకుండా.. తను స్వరపరిచిన పాటలను పాడడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఇళయరాజా.. అందరు ఈవెంట్ ఆర్గనైజర్లకు.. మేనేజ్మెంట్లకు కూడా నోటీసులు అందాయి.
ఎస్ పి బాలసుబ్రమణ్యం.. ఇళయరాజా.. వీరిద్దరూ వారి వారి రంగాల్లో లెజెండ్ లు. అలాగే వీరి కాంబినేషన్ లో వచ్చిన ఎన్నో సుమధురమైన పాటలు.. శ్రోతలను ఎంతో ఆకట్టుకున్నాయి. మరిచిపోలేని అనుభూతులను మిగిల్చాయి. కానీ ప్రస్తుతం వీరిద్దరి మధ్యా అంతగా పొసగడం లేదని పరిస్థితులు చూస్తే అర్ధమవుతుంది.
దీనిపై ఎస్ పి బాలసుబ్రమణ్యం తన టూర్ ను కొనసాగిస్తానని.. ఇళయారాజా పంపిన నోటీసులను గౌరవిస్తామని కూడా చెప్పారు. ఇళయరాజా పాటలను మినహాయించి.. ఇతర మ్యూజిక్ డైరెక్టర్లు కంపోజ్ చేసిన పాటలను మాత్రమే ఆలపించనున్నామని చెప్పారు ఎస్పీ బాలసుబ్రమణ్యం. ఇంతకీ వీరిద్దరికి ఏ విషయంలో తేడ వచ్చిందో…