సినీ ప్రముఖులకు జాతీయ పురస్కారాలు..

163
SPB, Hema Malini bag NTR awards

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2012- 2013 సంవత్సరాలకు సంబంధించి ప్రతిష్ఠాత్మక ఎన్టీఆర్‌, రఘుపతి వెంకయ్య, బీఎన్‌రెడ్డి, నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించింది. రాష్ట్రాలు రెండుగా మారినప్పటికీ తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఒక్కటే అని అందుకే ఇరు రాష్ట్రాలకు చెందిన చలన చిత్ర ప్రముఖులనూ ఈ అవార్డులకు ఎంపిక చేసినట్టు కమిటీ సభ్యులు నందమూరి బాలకృష్ణ, ఎం.మురళీమోహన్‌ తెలిపారు.

SPB, Hema Malini bag NTR awards

అవార్డు గ్రహీతలు వీరే..

()ఎన్టీఆర్‌ జాతీయ‌ చలనచిత్ర అవార్డు 2012- ఎస్పీ బాలసుబ్రమణ్యం
()ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు 2013- హేమమాలిని
()బీఎన్‌రెడ్డి అవార్డు 2012-సింగీతం శ్రీనివాసరావు
()బీఎన్‌రెడ్డి అవార్డు 2013 -కోదండ రామిరెడ్డి
()రఘుపతి వెంకయ్య అవార్డు 2012- కోడి రామకృష్ణ
()రఘుపతి వెంకయ్య అవార్డు 2013- వాణిశ్రీ
()నాగిరెడ్డి- చక్రపాణి జాతీయ చలనచిత్ర అవార్డు 2012- డి.సురేశ్‌బాబు
()నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ చలనచిత్ర అవార్డు 2013- దిల్‌రాజు

ఈ అవార్డులు గెలిచిన వారికి రూ.5 లక్షల నగదుతో పాటు  ప్రత్యేక జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేస్తారు. ఏపీ ప్రభుత్వం సినీ రంగ ప్రముఖులకు ఇచ్చే నంది అవార్డులను ప్రవేశపెట్టి 50 ఏళ్లు గడిచిన సందర్భంగా రెండురోజుల పాటు అంతర్జాతీయ స్థాయిలో స్వర్ణోత్సవాలను నిర్వహించి అవార్డులను ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. 2014, 2015, 2016కు సంబంధించి అవార్డుల గ్రహీతలను ఖరారు చేసి ఒకేసారి ప్రదానం చేయనున్నారు.