మొక్కలు నాటిన ఎస్పీ సాయి శేఖర్..

169
gic

రాజ్యసభ సభ్యలు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటారు నాగర్ కర్నూల్ ఎస్పీ శ్రీ సాయి శేఖర్ ఐపీఎస్ .
గద్వాల్ జిల్లా ఎస్పీ రంజన్ రజత్ కుమార్ గారు విసిరినా ఛాలెంజ్ ని స్వీకరించి నేడు నాగర్ కర్నూల్ ఎస్పీ కార్యాలయం లో సాయి శేఖర్ మొక్కలు నాటారు . ఈ సందర్బంగా మాట్లాడుతూ మనకు అడవుల శాతం 23, మన లక్ష్యం 33శాతం , ఈ లక్ష్యం పూర్తి చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హరిత హారం చేపట్టారని తెలిపారు.

దీనికి మద్దతు గా ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టి సబండ్డ వర్ణాల ప్రజానీకాన్ని ఏకతాటి మీదకి తీసుకొచ్చి మొక్కలు నాటే కార్యక్రమం ఉద్యమంలా కొనసాగిస్తున్నారు . ఈ మహాఉద్యమంలో నేను భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉంది . మొక్కలు పెంచడం వలన ప్రయోజనాలు , పర్యావరణ పరిరక్షణ పైన , వాటి ప్రయోజనాలను ప్రజలకు అనునిత్యం అవగాహనా కల్పిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ టీం మరియు ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ గారి ప్రత్యేకంగా అభినందించారు.

ఇలాంటి మంచి కార్యక్రమం గ్రామ స్థాయికి వెళ్లేలానే ఉద్యేశ్యం తో , జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని , రైతు సమానవ్యయ కమిటీలను భాగస్వామ్యం కావాలని కోరుతున్నాను . అలానే నేను మరో ముగ్గురికి బాలానగర్ డీసీపీ పి వి పద్మజా గారు యాదాద్రి భువనగిరి డీసీపీ నారాయణ రెడ్డి గారు , నాగర్ కర్నూల్ కలెక్టర్ శర్మాన్ గార్లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేశారు.