ప్రజల గుండెల్లో చిరస్ధాయిగా బాలు:ఎస్పీ చరణ్

91
sp balu

తెలుగు ప్రజలు ఉన్నంత వరకు నాన్న తమతో ఉంటారని, నాన్న పాటలు గుర్తుండిపోతాయని తెలిపారు ఎస్పీ చరణ్. కరోనాతో బాలు తుదిశ్వాస విడిచిన నేపథ్యంలో మాట్లాడిన బాలు..నాన్న కోలుకోవాల‌ని ప్రార్థన‌లు చేసిన అశేష అభిమానులు, ఆయ‌న‌కు సేవ‌లందించిన డాక్ట‌ర్లు, న‌ర్సులు, ఆస్ప‌త్రి సిబ్బందికి హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు తెలిపారు.

ఆగస్టు 5న కరోనాతో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో బాలు చేరిన దగ్గరి నుండి ఎప్పటికప్పుడు బాలు ఆరోగ్య పరిస్ధితిపై ఎప్పటికప్పుడు అప్‌ డేట్ ఇస్తూనే ఉన్నారు చరణ్. నాన్న త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్ధించాలని కోరారు.