ఎస్పీ బాలు ఆరోగ్యం విషమం..

138
spb

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విషమించినట్లు తెలుస్తోంది.. గత కొన్నిరోజులుగా ఆయన ఆరోగ్యంపై ఆసుపత్రి నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. చివరిసారిగా చెన్నై ఎంజీఎం ఆసుపత్రి ఈ నెల 19న బులెటిన్ విడుదల చేసింది. బాలుకు కరోనా సోకడంతో సుమారు 40 రోజులుగా ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. పూర్తిగా కోలుకుంటున్న సమయంలో ఆయన మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. కరోనా తగ్గినా ఇతర అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారని ఆసుపత్రి వర్గాల సమాచారం.

అయితే, ఎస్పీ బాలు కుమారుడు చరణ్ రెండ్రోజుల కిందట కూడా తన తండ్రి బాగానే ఉన్నారంటూ తెలిపారు. చరణ్ గత కొన్నిరోజులుగా ఎంతో సానుకూల రీతిలో తండ్రి ఆరోగ్యంపై అప్ డేట్లు ఇస్తుండడంతో అభిమానులు ఎంతో రిలీఫ్ ఫీలయ్యారు. వాస్తవానికి ఆయన ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తున్నట్టు తాజా పరిణామాలతో అర్థమవుతోంది. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. కాసేపట్లో బాలు ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు హెల్త్‌బులెటిన్‌ విడుదల చేయనున్నారు.