టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న RCB..

155
rcb

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2020‌ 13వ సీజన్లో భాగంగా ఈ రోజు కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలో దిగుతున్నట్లు కోహ్లీ చెప్పాడు. మరోవైపు పంజాబ్‌ టీమ్‌లో రెండు మార్పులు జరిగాయి. జోర్డాన్‌, గౌతమ్‌ స్థానంలో జిమ్మీ నీషమ్‌, మురుగన్‌ అశ్విన్‌లను జట్టులోకి తీసుకున్నట్లు ఆ జట్టు సారథి కేఎల్‌ రాహుల్‌ వివరించాడు.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, నికోలస్ పూరన్, గ్లెన్ మ్యాక్స్ వెల్, సర్ఫ్రాజ్ ఖాన్, జిమ్మీ నీషామ్, మహ్మద్ షమీ, మురుగన్ అశ్విన్, షెల్డన్ కాట్రెల్, రవి బిష్ణోయ్.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, ఆరోన్ ఫించ్, ఏబీ డివిలియర్స్, శివం దూబే, జోష్ ఫిలిప్పే (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైనీ, ఉమేశ్ యాదవ్, డేల్ స్టెయిన్, యజువేంద్ర చహల్.