ఒకే రోజులో 7,855 కరోనా కేసులు..

43
corona

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఏపీలో గడచిన 24 గంటల్లో కొత్తగా 7,855 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 52 మరణించారని ఏపీ వైద్యారోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో మొత్తం కొవిడ్‌-19 కేసుల సంఖ్య 6,54,385కు చేరింది. ఏపీలో 69,353 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు 5,79,474 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 5558కు పెరిగింది. గడచిన 24 గంటల్లో 76వేల మంది కరోనా టెస్టులు నిర్వహించారు. గురువారం వరకు రాష్ట్రంలో 53,78,367 శాంపిల్స్‌ పరీక్షించారని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.