నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారం ఈ నెల 30తో ముగియనుంది. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్ కుమార్‌కు టీఆర్‌ఎస్ టికెట్ ఇచ్చింది. తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్..భగత్‌కు బీఫామ్ అందజేశారు. పార్టీ ప్రచారం కోసం 28లక్షల చెక్‌ను కూడా అందించారు. మంగళవారం భగత్ తన నామినేషన్ వేయనున్నారు.
ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ తరఫున ప్రచారం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గుర్రాల నాగరాజు (సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షుడు ) ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రచారంలో టీఆర్‌ఎస్ సౌత్ ఆఫ్రికా ఎన్నారై శాఖ తరఫున ప్రత్యక్షంగా శివ కుమార్ యాదవ్ కట్టబోయిన (పెద్దవూర మండలం ) అధ్వర్యంలో ప్రచారం చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ప్రచారంలో భాగంగా పెద్దవూర మండలంలో అన్ని గ్రామాల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాల్ని ప్రచారం చేయనున్నట్లు శివ కట్టబోయిన పేర్కొన్నారు.