నైరుతి రుతుపవనాల..అప్‌డేట్

7
- Advertisement -

నైరుతి రుతుపవనలు చురుగ్గా కదులుతున్నాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే మూడు, నాలుగు రోజుల్లో అరేబియా సముద్రం, మాల్దీవులు బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు చేరుతాయని తెలిపింది.

అండమాన్ నికోబార్ దీవులకు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల్లో తెలికపాటు నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపారు.

ఈరోజు ఉత్తర కోస్తా జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే ఈరోజు అల్లూరి ,పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, అనకాపల్లి , కాకినాడ ,ఏలూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.

Also Read:HIT3: ఓటీటీ డేట్ లాక్!

- Advertisement -