మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి విజయ్ షాకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కల్నల్ సోఫియా ఖురేషిని “ఉగ్రవాదుల సోదరి” అని అన్నందుకు తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టేయాలని సుప్రీంకోర్టుకి వెళ్లారు మంత్రి విజయ్ షా.
ఈ సమయంలో జోక్యం చేసుకోలేం అంటూ నిరాకరించింది సుప్రీంకోర్టు. నిన్న మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఇండోర్‌లోని మోవ్‌లోని మాన్పూర్ పోలీస్ స్టేషన్‌లో మంత్రి విజయ్ షాపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
కల్నల్ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్ మంత్రి అజయ్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మన ఆడబిడ్డల సిందూరాన్ని చెరిపేసిన వారి అంతు చూడాలని.. వారి సామాజిక వర్గానికి చెందిన సోదరిని మోడీ పంపాడు..మన హిందువుల బట్టలు విప్పినందుకు.. ప్రతీకారం తీర్చుకోవడానికి వారి జాతి బిడ్డను పంపించాం అని వ్యాఖ్యానించారు.
దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు రావడంతో సోఫియాకు పది సార్లైనా క్షమాపణ చెప్తాను అన్నారు. ఆమె తనకు సొంత చెల్లి కంటే ఎక్కువని దేశం కోసం సోఫియా చేస్తున్న సేవలకు సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు.
Also Read:రామ్..ఆంధ్ర కింగ్ తాలుకా

