హీరో సూర్యపై విమర్శలు సరికాదు..

103
surya
- Advertisement -

రాజకీయాలు, కులం, మతం అనే భేషజాలు లేకుండా సేవ చేస్తున్న హీరో సూర్యపై విమర్శలు సరికాదని దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి విఙ్ఞప్తి చేసింది. ఈ మేరకు చాంబర్‌ అధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.

తమ చాంబర్‌ సభ్యుడైన హీరో సూర్య తక్షణం మీ మనోభావాలను అర్థం చేసుకుని ఆ సీన్‌ను తొలగించారు. ఆ చిహ్నాన్ని చిత్రంలో చూపించడం వెనుక చిత్ర నిర్మాణ సంస్థకు లేదా హీరోకు ఎలాంటి సంబంధం లేకపోయినా వన్నియర్‌ వర్గం నేతలు హీరో సూర్యపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ విమర్శల పట్ల ఫిల్మ్‌ చాంబర్‌ అసంతృప్తిని, అవేదనను వ్యక్తం చేస్తోంది అని పేర్కొన్నారు.

డిసెంబరు 2వ తేదీన అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో విడుదలై ఘన విజయం సాధించింది. అయితే, ఇందులోని కొన్ని సన్నివేశాలు వన్నియర్‌ వర్గాన్ని కించపరిచేలా, కొన్ని పాత్రల పేర్లు కొందరు వ్యక్తులను గుర్తుకు తెచ్చేలా ఉన్నాయనే విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలకు సూర్య కూడా ప్రకటన రూపంలో వినమ్రంగా సమాధానమిచ్చారు.

- Advertisement -