గాయం తర్వాత హీరో సూర్య స్పందన

38
- Advertisement -

తమిళ స్టార్ హీరో సూర్య షూటింగ్‌లో గాయపడిన సంగతి తెలిసిందే. అయితే, సూర్యను పరీక్షించిన వైద్యులు ఆయన పరిస్థితి బాగానే ఉందని, కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని చెప్పారని నిర్మాతలు వెల్లడించారు. కాగా, సూర్య నటిస్తున్న కంగువా మూవీలోని ఓ భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో సూర్యపై కెమెరా పడింది. ఈ ప్రమాదంలో సూర్య భుజానికి గాయమయింది. అయితే, తాజాగా గాయంపై సూర్య ట్వీట్ చేశారు.

‘‘మిత్రులు, శ్రేయోభిలాషులు, నా ప్రియమైన అభిమానులు అందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరంతా నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. నేనిప్పుడు బాగానే ఉన్నా, కోలుకుంటున్నా. మీ ప్రేమకి రుణపడి ఉంటా’’ అని సూర్య పోస్ట్ చేశారు. అసలు ఇంతకీ సూర్య ఎలా గాయ పడ్డారు అంటే.. చెన్నైలోని EVP ఫిల్మ్ సిటీలో ప్రస్తుతం సూర్య సినిమా చిత్రీకరణ జరుగుతోంది. నిన్న కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రించేందుకు రోప్ కెమెరాలను ఏర్పాటు చేశారు.

ప్రమాదవశాత్తు రోప్ కెమెరాలోని కొంత భాగం తెగిపోయింది. గమనించిన సిబ్బంది సూర్యను అప్రమత్తం చేయగా పెను ప్రమాదం తప్పింది. కాగా ఆయన భుజానికి స్వల్ప గాయమైనట్లు సమాచారం. సిబ్బంది గానీ సూర్యను అప్రమత్తం చేయకపోయి ఉంటే.. పెద్ద ప్రమాదం జరిగి ఉండేది.

Also Read:Sound Party:సౌండ్ పార్టీ మూవీ రివ్యూ

- Advertisement -