రైల్వే భద్రతపై కీలక ప్రకటన

18
- Advertisement -

రైల్వే భద్రత విషయంలో పాటించవలసిన పలు జాగ్రత్తలపై కీలక ప్రకటన జారీ చేసింది దక్షిణ మధ్య రైల్వే. రైళ్లు కదులుతున్న సమయంలో ఎక్కడం, దిగడం, పట్టాలు దాటడం చట్టరీత్యా నేరమని, ప్రాణ హాని జరిగే ప్రమాదం ఉందని దక్షిణ మధ్య రైల్వే హెచ్చరించింది..

నిషేధిత ప్రాంతం నుంచి రైల్లోకి ప్రవేశించొద్దు.. ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జీలు, సబ్‌-వే లు, రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జీలను వాడాలని సూచించింది. ట్రాక్‌ల దగ్గర నడిచే సమయంలో ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు మొబైల్‌ ఫోన్‌ లను ఉపయోగించొద్దని తెలిపింది. రైల్వే ట్రాక్‌ల పరిసర ప్రాంతాలలో సెల్ఫీ, ఫొటోగ్రఫీ తీసుకోవడంపై నిషేధం అని తెలిపింది.

భారతీయ రైల్వే చట్టం -1989 లోని సెక్షన్‌ 147 ప్రకారం రైల్వే ట్రాక్‌ను దాటడం చట్టరీత్యా నేరం.. ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా రూ. వెయ్యి వరకు జరిమానా. లేదా రెండు శిక్షల విధింపు ఉంటుందని తెలిపింది.

Also Read:లోక్ సభ ఎన్నికలు..మార్గదర్శకాలివే

- Advertisement -