కన్నడలో చిన్న సినిమా మొదలై పాన్ ఇండియా స్థాయిలో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది కాంతార. అయితే నటుడు దర్శకుడు రిషబ్ శెట్టి తాజగా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ఎబి డివిలియర్స్‌ను కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలను వీడియోలను ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా కాంతార సినిమాను ఎబీడీ మెచ్చుకున్నారు. కాంతారను హోంబలే ఫిలిమ్స్ నిర్మించింది. ఈ చిత్రం విమర్శకులను సైతం ప్రశంసల మెప్పును పొందింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ భారీ వసూళ్లను రాబడుతుంది. బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది.
కాంతార ను రజినీకాంత్, వివేక్ అగ్నిహోత్రి, ప్రభాస్, పూజా హెగ్డే, శిల్పాశెట్టి, కంగనారనౌత్ తదితరులు పొగిడారు. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఎబి. డివిలియర్స్ కాంతార ను పొగిడాడు. ఈ సందర్భంగా డివిలియర్స్ కాంతార ను అద్భతమైన చిత్రమని కొనియడాడు. కాంతార యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందింది.
సప్తమి గౌడ, కిషోర్, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి తదితరులు కీలక పాత్రలు పోషించారు. కాంతార కు అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించాడు. అరవింద్ ఎస్. కశ్యప్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు. కెఎమ్. ప్రకాష్, ప్రతీక్ శెట్టి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.
తొలుత ఈ చిత్రం కన్నడలో రిలీజ్ అయ్యింది. అనంతరం ప్రేక్షకుల డిమాండ్ మేరకు ఇతర భాషల్లోకి డబ్ చేశారు. టాలీవుడ్‌లో ఈ చిత్రం రూ.50కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. బాలీవుడ్‌లోను భారీ కలెక్షన్స్‌ను కొల్లగొడుతుంది.
ఈ మూవీ విడుదలైనప్పటి నుంచి అనేక రికార్డులను క్రియేట్ చేస్తుంది. కర్ణాటకలో కెజియఫ్ నెలకొల్పిన అనేక రికార్డులను ఈ మూవీ చెరిపేసింది. ఐఎమ్‌డీబీలోను అత్యధిక రేటింగ్‌ను సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. కెజియఫ్, ఆర్ఆర్ఆర్ లను బీట్ చేసి అత్యధిక రేటింగ్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
ఒకే ఒక్క త్రో…మ్యాచ్‌ను మలుపు తిప్పింది
అందగత్తె కాదు మోసగత్తె :లీలానీ
లావైనా భామలు వీళ్లే…అయిన హిట్టు