టీంఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తర్వలో బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఈసందర్భంగా ఆయనకు పలువురు పలువురు ఆత్మీయులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షాలు తెలుపుతున్నారు. తాజాగా మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ దాదాకు శుభాకాంక్షాలు తెలుపుతు ట్వీట్ చేశాడు. ఇతరులను కూడా లీడర్లుగా తీర్చిదిద్దే సత్తా ఉన్నవారు మీరంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.
బీసీసీఐ అధ్యక్షుడిగా పదవి చేపట్టబోతున్న నేపథ్యంలో మీకు నా శుభాకాంక్షలు అంటూ.. రాబోయే రోజులు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నానంటూ పేర్కొన్నాడు. అయితే భజ్జీ చేసిన ట్వీట్‌కు దాదా ధన్యవాదాలు తెలుపుతూ రీ ట్వీట్ చేశాడు. నీవు నా వెంటే ఉండాలని కొరుకుంటున్నా.. గతంలో టీమిండియాకు బౌలింగ్ చేసి ఎలా విజయాలు అందించావో.. అలాగే నాకు కూడా నీ సహకారం అందివ్వాలంటూ ట్వీట్ చేశాడు.
గంగూలీ ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్)కు అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఈ పదవికి రాజీనామా చేసి ఈనెల 23న బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించనున్నారు. గంగూలీ బీసీసీఐ పగ్గాలు చేపట్టడంతో దేశ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.