నిలకడగా గంగూలీ ఆరోగ్యం..!

165
bcci
- Advertisement -

బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ ఆరోగ్య పరిస్ధితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు డాక్టర్లు. దాదా ఆరోగ్య పరిస్ధితి ప్రస్తుతం నిలకడగా ఉందని…యాంజియోప్లాస్టీ ద్వారా పూడుకుపోయిన గుండె రక్తనాళాల్లో మరో రెండు స్టెంట్లను అమర్చామని డాక్టర్లు తెలిపారు.

ప్రస్తుతం గంగూలీని క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌లోని ప్రత్యేక గదికి తరలించినట్టు వెల్లడించారు. సౌరవ్‌ గంగూలీని డాక్టర్‌ అఫ్తాబ్‌ ఖాన్‌, డాక్టర్‌ అశ్విన్‌ మెహతా పరీక్షించారు.

తొలుత ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరిన గంగూలీకి ఒక స్టంట్ వేయగా కొలుకున్నారు. డిశ్చార్జ్ అయిన తర్వాత నాలుగు రోజులతో తిరిగి ఛాతి నొప్పితో బాధపడుతుండగా ఆస్పత్రిలో చేరగా మరో రెండు స్టంట్స్ వేశారు డాక్టర్లు.

- Advertisement -