కేటీఆర్ సూపర్‌స్టార్ : సోనూసూద్

157
ktr sonu

టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు బాలీవుడు న‌టుడు సోనూసూద్ ట్విట్ట‌ర్ వేదిక‌గా జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. కేటీఆర్ త‌న‌కొక్క‌రికే సూప‌ర్ స్టార్ కాదు.. తెలంగాణ రాష్ర్టానికి పుట్టుక‌తోనే సూప‌ర్ స్టార్ అని సోనూసూద్ పేర్కొన్నారు. కేటీఆర్‌ను హ‌గ్ చేసుకోవాల‌ని ఆత్రుత‌గా ఉంద‌ని…ఈ ఏడాది, వ‌చ్చే ఏడాది కూడా బాగా గ‌డ‌వాలి అని ఆకాంక్షించారు. కేటీఆర్ విజ‌న్ మిలియ‌న్ల మందికి మార్గ‌ద‌ర్శ‌క‌మ‌ని వెల్లడించారు. సోనూసూద్ ట్వీట్‌కు కేటీఆర్ స్పందిస్తూ.. థ్యాంక్స్ చెప్పారు.