సోనూ సూద్ @ 10 మిలియన్‌

66
sonu
- Advertisement -

కరోనా కష్టకాలంలో వలస కార్మికులకు అపద్బాంధవుడిగా మారాడు సోనూసూద్. గతేడాది మొదలు పెట్టిన ఆయన సామాజిక సేవ.. నేటికి సామాన్యుల నుంచి సెలబ్రెటిలు, రాజకీయ నేతల వరకు కొనసాగుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా ఆయనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇటీవల లాక్‌డౌన్ సమయంలో, సోనూ సూద్ సోషల్ మీడియా ద్వారా లక్షలాది మందికి సహాయం చేశాడు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు సోనూ సూద్ ను ట్విట్టర్ లో ఫాలో అవుతున్న వారి సంఖ్య ఏకంగా కోటి కి చేరింది. ఒక నటుడిగా కంటే మానవత్వం ఉన్న వ్యక్తిగా సోనూసూద్ ను గుర్తించే ఇంతమంది ఫాలో అవుతున్నారనేది నిజం. అందుకే అతను కూడా ట్విట్టర్ అకౌంట్ పేజీలో తమ సేవా కార్యక్రమాలు ఉచితమని, ఎవరికీ ధనాన్ని ఇవ్వవద్దని పేర్కొన్నాడు.

ఇక సోనూపై రాజకీయ కుట్ర జరుగుతున్న నేపథ్యంలో ఆయనకు అండగా ఉంటామని తేల్చి చెప్పారు సోనూ సూద్. సోనూ రాజకీయాలలోకి ఎక్కడ వస్తాడో అనే భయంతో కొందరు ఆడుతున్న నాటకమని మండిపడిన సంగతి తెలిసిందే.

- Advertisement -