హైదరాబాద్ పోలీసులకు సెల్యూట్: సోనూ

34
sonu

హైదరాబాద్ పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు సినీ నటుడు సోనూ సూద్. తన పేరును వాడుకుంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసిన హైదరాబాద్‌ పోలీసులకు సెల్యూట్ చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన ఆశిష్‌ కుమార్‌ అనే వ్యక్తి సోనూసూద్‌ పేరుతో ఫేస్‌బుక్‌లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి, సాయం కోసం ఎదురుచూసే వారిని టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడ్డాడు.

అయితే మోసపోయిన బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న సోనుసూద్‌ ట్విట్టర్ ద్వారా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.