మెడికల్ టెక్నాలజీ హబ్‌గా హైదరాబాద్: కేటీఆర్

58
ktr

లైఫ్ సైన్స్ కాపిటల్ గా హైదరాబాద్ మారుతోందన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌ నానక్‌రామ్‌గూడా బీఎస్‌ఆర్‌ టెక్‌ పార్క్‌లో మెడ్‌ట్రానిక్స్ ఇంజినీరింగ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ను పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్‌తో కలిసి ప్రారంభించారు. వర్చ్యువల్ గా అమెరికా కాన్సులేట్ జనరల్ జోయల్ రిఫ్ మాన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…అమెరికా వెలుపల అతిపెద్ద కార్యాలయాలను ప్రారంభించిన కంపెనీల జాబితాలో మెడ్‌ట్రానిక్స్ చేరిందన్నారు. 11 నెలల్లో ఈ కేంద్రం పూర్తి చేయటం హర్షణీయం….ఎక్కువ విలువున్న డిసైన్ అండ్ డెవలప్మెంట్ పరికరాలను ఇక్కడ తయారీ వల్ల ఆ రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. మెడికల్ పరికరాలు తయారు చెసే కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నా అన్నారు

ప్రభుత్వ చర్యల వల్ల హైదరాబాద్ మెడికల్ టెక్నాలజీ హబ్ గా మారుతోంది…2030 వరకు హైదరాబాద్ లైఫ్ సైన్స్ మార్కెట్ విలువ 100 బిలియన్ లకు చేరేందుకు ప్రణాళికలు ఉన్నాయన్నారు. తెలంగాణ మెడ్ టెక్ ప్లాన్ కు ఈ మెడ్‌ట్రానిక్స్ కేంద్రం ఊపయోగపడుతుందని….మెడ్ ట్రానిక్ కేంద్రాటెక్‌ పార్క్ లో రూ.1200 కోట్లతో ఏర్పాటు చేయనుందన్నారు. ప్రపంచస్థాయి వైద్య పరికరాల ఇంజినీరింగ్‌, ఆవిష్కరణలు చేయనుంది… దీనిద్వారా హెల్త్ కేర్‌ రంగంలో ఇంజినీరింగ్‌ చేసినవారికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు.

అమెరికాలోని మిన్నెసోటా కేంద్రంగా మెడ్‌ట్రానిక్‌ పనిచేస్తున్నది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఇప్పటికే హైదరాబాద్‌లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని నిర్వహిస్తున్నది. నగరంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రం ద్వారా ప్రారంభంలో వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. విడతల వారీగా మరో నాలుగు వేల మందికి ఉపాధి కల్పించనుంది. మెడ్‌ట్రానిక్‌ సంస్థ అమెరికా తర్వాత హైదరాబాద్‌లోనే తన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.