వడ్డీ రేట్లు యథాతథం..

54
rbi

రెపో రేటు, రివ‌ర్స్ రెపో రేటును యధాతథంగా ఉంచినట్లు వెల్లడించారు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన రెపో రేటు 4 శాతం,రివ‌ర్స్ రెపో రేటును 3.35 శాతంగా ఉంచినట్లు వెల్లడించారు. ద్ర‌వ్య‌ప‌ర‌ప‌తి విధానంలో భాగంగా భార‌తీయ బ్యాంకుల‌కు కొత్త‌గా 50వేల కోట్ల రుణం ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు.

మ‌ళ్లీ కోవిడ్ విజృంభ‌ణ‌తో దేశీయ ఆర్థిక ప్ర‌గ‌తి అస్థిరంగా మారిందని….. ప‌లు రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌ఠిన ఆంక్ష‌లు అమ‌లు చేయ‌డం వ‌ల్ల ఇలా జ‌రిగిన‌ట్లు ఆయ‌న తెలిపారు. మార్కెట్ల‌కు కావాల్సినంత ద్ర‌వ్యాన్ని అందించ‌నున్న‌ట్లు శ‌క్తికాంత్‌దాస్‌ వెల్ల‌డించారు. ఏప్రిల్ అయిదో తేదీ నుంచి ఏడు తేదీ వ‌ర‌కు ఆర్బీఐ ద్ర‌వ్య‌ప‌ర‌ప‌తి క‌మిటీ స‌మావేశ‌ం కాగా ఆరుగురు స‌భ్యుల బృందం తీసుకున్న నిర్ణ‌యాల‌ను ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ దాస్ వెల్ల‌డించారు.