సోనూసూద్ దాతృత్వం…

220
sonu

సినీనటుడు సోనూసూద్ మ‌రోసారి మాన‌వ‌త్వం చాటుకున్నారు. శ్వాస‌కోశ స‌మ‌స్య ఉన్న బాలుడికి సోనూసూద్ అండ‌గా నిలిచారు.త‌న కుమారుడి ఆరోగ్య‌ ప‌రిస్థితిని వివ‌రిస్తూ ఐదు రోజుల క్రితం ఓ త‌ల్లి ట్వీట్ చేసింది. త‌న బిడ్డ‌కు ఓపెన్ హార్ట్ స‌ర్జ‌రీ చేయాల‌ని వైద్యులు సూచించార‌ని ఎవరైన సాయం చేయాలని కోరగా బాలుడి త‌ల్లి ట్వీట్‌కు సోనూసూద్ స్పందించి సాయం చేసేందుకు ముందుకు వ‌చ్చారు.

అనారోగ్యం బారిన ప‌డ్డ బాలుడిని సోమ‌వారం ముంబై ఎస్ఆర్‌సీసీ ఆస్ప‌త్రిలో చేర్పిస్తాన‌ని సోనూసూద్ ట్వీట్ చేశారు. బాలుడికి వారంలోగా శ‌స్ర్త చికిత్స చేస్తార‌ని ఆయ‌న తెలిపారు.