పెరిగిన బంగారం ధరలు..

93
gold

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.240 పెరుగుదలతో రూ.51,510కు చేరగా 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.220 పెరిగి రూ.47,220కు చేరింది.

బంగారం ధరలు పెరిగితే వెండి ధర మాత్రం స్ధిరంగానే ఉంది. కేజీ వెండి ధర రూ.62,500 వద్దనే నిలకడగా ఉంది.అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.31 శాతం తగ్గుదలతో 1899 డాలర్లకు చేరగా వెండి ధర ఔన్స్‌కు 1.17 శాతం క్షీణతతో 24.39 డాలర్లకు చేరింది.