రూ. 20 కోట్ల పన్ను ఎగవేసిన సోనూ: ఐటీ శాఖ

44
sonu

సినీ నటుడు సోసూ సూద్ ఇళ్లు, ఆఫీస్‌లపై ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఐటీ రైడ్స్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించింది ఐటీ శాఖ. సోనూ దాదాపు రూ .20కోట్లకు పైగా ఆదాయపు పన్ను ఎగవేసినట్లు ఆదాయపు పన్నుశాఖ తెలిపింది.

ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్టాన్ని ఉల్లంఘించి క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ ఫాం ను ఉపయోగించి సోనూసూద్ విదేశీ దాతల నుంచి రూ.2.1 కోట్లను సేకరించారని ఆదాయపుపన్ను శాఖ అధికారులు చెప్పారు. సోనూసూద్ ఇళ్లు, అతని కార్యాలయాల్లో మూడు రోజుల పాటు జరిపిన దాడుల్లో పన్ను ఎగవేతకు సంబంధించి పలు పత్రాలు దొరికినట్లు ఐటీశాఖ అధికారులు చెప్పారు.

సూద్ ఛారిటీ ఫౌండేషన్ ఈ ఏడాది ఏప్రిల్ వరకు రూ.18 కోట్ల విరాళాలను సేకరించగా, అందులో 1.9 కోట్లను సహాయపనులకు ఖర్చు చేశారని తేలింది. మిగిలిన 17 కోట్లు లాభాపేక్ష లేని ఆ సంస్థ బ్యాంకు ఖాతాలో ఉంచారని వెల్లడైంది.

ఢిల్లీ ప్రభుత్వం విద్యార్థులకు మార్గనిర్దేశం చేసే ఉద్దేశంతో రూపొందించిన కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ సోదాలపై ఆప్,శివసేన…కేంద్రం తీరును తప్పబట్టాయి.