మా బరిలో రఘుబాబు..

43
raghu

మా ఎన్నికల బరిలో నిలవనున్నారు సినీ నటుడు రఘుబాబు. అక్టోబర్ 10న మా ఎన్నికలు జరగనుండగా ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. అయితే ఇప్పటివరకు ప్రకాశ్ రాజ్ మాత్రమే తన ప్యానల్‌ని ప్రకటించగా మంచు విష్ణు మాత్రం తన ప్యానల్ సభ్యులను ప్రకటించలేదు.

అయితే అధికారికంగా అందుతున్న సమాచారం ప్రకారం మా ఎన్నికల బరిలో విష్ణు ప్యానల్ తరపున ప్రధాన కార్యదర్శిగా రఘుబాబు బరిలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన జనరల్‌ సెక్రటరీగా విజయం సాధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుండి జనరల్‌ సెక్రటరీ పదవి కోసం జీవిత పోటీ పడతుండగా, బండ్ల గణేశ్‌ స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు.