టీఆర్ఎస్..లైఫ్‌ లైన్‌ ఆఫ్ తెలంగాణ : కేటీఆర్

38
Minister KTR

హుజురాబాద్‌లో గెలిచేసి టీఆర్ఎస్సేనని జోస్యం చెప్పారు మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన కేటీఆర్… తెలంగాణకు 2వేల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయన్నారు. మేము ప్రభుత్వంలో ఉన్నాము- సంక్షేమంలో మేము నిమగ్నమయ్యామని చెప్పారు. మేము- మా ఎమ్మెల్యేలు అభివృద్ధి పనుల్లో బిజీగా ఉన్నాం… కేసీఆర్ అభివృద్ధి పథకాలు చూసుకుంటూ పాదయాత్రలు చేస్తున్నారని చెప్పారు.

జానారెడ్డి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి- చిన్న పిలగాడు ఓడించాడు… ప్రజలకు టీఆర్ఎస్‌పై నమ్మకం ఉందని హుజురాబాద్‌లో గెలిచేది టీఆర్ఎస్‌ అని స్పష్టం చేశారు కేటీఆర్. గజ్వేల్ లో కాకుండా రాష్ట్రంలో ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చు…. హుజురాబాద్ లో కాంగ్రెస్ కి డిపాజిట్లు వస్తాయా? అని ప్రశ్నించారు కేటీఆర్. కొత్తగా కాంగ్రేస్ లో రియలెస్టేట్ భూమ్ వచ్చింది… వంటేరు ప్రతాప్ రెడ్డి అప్పట్లో ఇంతకంటే గొప్పగా సభలు పెట్టారు… ప్రజలు చాలా చైతన్యవంతులు ఎవరికి ఓట్లు వెయ్యలో వాళ్లకు తెలుసు అన్నారు.

ఎంఐఎంకు ఎవరూ భయపడటం లేదని…బీజేపీ భయపడుతోందన్నారు. బీజేపీ ఆదిలాబాద్ కి ట్రైబెల్ యూనివర్సిటీ ఇస్తామన్నారు ఇచ్చారా?… సాయుధ పోరాటం చేసిన నేతలకు పెన్షన్స్ ఇవ్వమంటే కేంద్రం ఇవ్వడం లేదన్నారు. అమిత్ షా రాష్ట్రానికి వచ్చి తెలంగాణ కేంద్రం ఇచ్చిన ప్రాజెక్టు ఒక్క దాని గురించి అయినా చెప్పారా? అని ప్రశ్నించారు. ఎంపిలుగా గెలిచి బీజేపీ నేతలు రాష్ట్రానికి ఏం చేశారు?… ఢిల్లీ పార్టీలు సిల్లి పాలిటిక్స్ చేస్తున్నాయని మండిపడ్డారు.

కొత్తగా పుట్టుకొచ్చిన కొన్ని పార్టీలు ఎందుకు పుట్టాయో ప్రజలకు తెలుసు…. ఢిల్లీ పార్టీల పై ఎందుకు మాట్లాడరని షర్మిల పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు కేటీఆర్. కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీలు- విద్యాలయాలు- ఇవ్వకపోతే ప్రవీణ్ కుమార్ ఎందుకు మాట్లాడటం లేదన్నారు?. కాంగ్రెస్- బీజేపీ పై షర్మిల- ప్రవీణ్ కుమార్ ఎందుకు మాట్లాడటం లేదు? అన్నారు. టీఆర్ఎస్‌ ఓటును చీల్చడానికి ఉద్భవించిన పార్టీలు షర్మిల- ప్రవీణ్ కుమార్ అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్‌ ప్రజలకు లైఫ్ లైన్ ఆఫ్ తెలంగాణ అన్నారు.