హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిన సోనూ!

38
sonu

కరోనా విపత్కర సమయంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ రియల్ హీరో అనిపించుకున్నారు సోనూ సూద్. ఆయన చేసే సాయానికి ఎల్లలు లేకపోగా ఆయన్ని దేవుడిలా కొలిచే వారున్నారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సోనూకు మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించే ఆఫర్లు వస్తుండటంతో సోనూ మరింత మందికి సాయం చేస్తూ ముందుకుసాగుతున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగ ఉన్న సోనూ..త్వరలో హైదరాబాద్‌కు షిఫ్ట్ కాబోతున్నారు. ఇప్పటివరకు ఎప్పుడు హైదరాబాద్‌కు వచ్చినా పార్క్ హయత్‌లో ఉంటున్న సోనూ…టాలీవుడ్ లో భారీగా ఆఫర్లు వస్తుండడంతో ఇక్కడ ఓ ఇంటిని కొనుగోలు చేస్తే బెటర్ అని భావించి బంజారా హిల్స్ ప్రాంతంలో ఒక ఇంటిని కొనుగోలు చేశాడట.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి “ఆచార్య” చిత్రంలో సోను సూద్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కోరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది.