ఎన్టీఆర్ షోకు ఫస్ట్ గెస్ట్ ఎవరో తెలుసా…?

214
ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా ఎవరు మీలో కోటీశ్వరులు షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎపిసోడ్స్‌ షూటింగ్ జరుగుతుండగా తాజాగా ఆసక్తికర వార్త టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది.

హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఈ షో చిత్రీకరణ జరుగుతుండగా షోకు ఫస్ట్ గెస్ట్ ఓ స్టార్ హీరో రాబోతున్నాడట. ఆ గెస్ట్ ఎవరంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇప్పటికే బిగ్ బాస్‌ షో మొదటి ఎపిసోడ్‌కు ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించగా ఆ ఎక్స్‌పీరియన్స్‌తో ఎవరు మీలో కోటీశ్వరులు చేయనున్నారు ఎన్టీఆర్. ఈ టీవీ షో ప్రోమోను త్వరలో విడుదల చేయనున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్‌ కలిసి ఆర్‌ఆర్ఆర్ మూవీ చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోంది. అక్టోబర్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.