ప్రకాశ్‌ రాజ్‌ విజన్ చూసే సపోర్ట్ చేశా: నాగబాబు

36
nagababu

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. అందరికంటే ముందుగా తన ప్యానల్‌ని ప్రకటించి దూసుకుపోతున్నారు ప్రకాశ్‌ రాజ్‌. ఇక ఆయనకు పోటీగా మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, సీవీఎల్ నరసింహరావు బరిలో ఉంటామని ప్రకటించగా సాధారణ ఎన్నికలను తలపించేలా మా ఎన్నికలు మాటల యుద్ధానికి దారితీశాయి.

ఇక మూవీ ఆర్టిస్ట్‌ ఎన్నికల్లో ప్రకాశ్‌ రాజ్‌కు సపోర్ట్‌ చేస్తున్న మెగా బ్రదర్ నాగబాబు మరోసారి స్పందించారు. ప్రకాశ్ రాజ్‌కి మంచి విజ‌న్ ఉంది అందుకే ఆయనకు సపోర్ట్ చేశానని తెలిపారు నాగబాబు. అన్నిరాష్ట్రాల ప్ర‌భుత్వాల‌తో మంచి సంబంధం ఉంది. బిజీ స‌మ‌యంలోను త‌న స‌మయాన్ని ‘మా’కు కేటాయిస్తామ‌ని అన్నారు.. ఓ యాక్షన్‌ ప్లాన్‌తో ప్రకాశ్‌రాజ్‌ ఉన్నారు. అందుకే నా మ‌ద్ద‌తు తెలియ‌జేస్తున్నాను అని నాగ‌బాబు స్ప‌ష్టం చేశారు. ప్రకాశ్ రాజ్ గెలిచినా, విష్ణు గెలిచినా అంద‌రం క‌లిసే ప‌ని చేస్తాం. సినిమా ఇండస్ట్రీలో అనుభవం ఉన్న వ్యక్తి ఓ పని చేయడానికి వస్తే ఎదుటి వ్యక్తి ఓ అడుగు వెనక్కి వేయడంలో తప్పులేదని నా అభిప్రాయం…ఎలక్షన్లకు ఇంకా రెండు నెలల సమయం ఉంది. ఇప్పుడు జరిగేది అంతా టీ కప్పులో తుపాను లాంటిదని వెల్లడించారు.

రాష్ట్రం విడిపోవడం వల్ల రకరకాల కారణాలతో అసోసియేషన్‌ బిల్డింగ్‌ కట్టడం కన్నా వెల్ఫేర్‌ ముఖ్యమనే ఆలోచనతో భూమి సేకరణ, భవన నిర్మాణ పనులు మూలన పడ్డాయని తెలిపారు ఇప్ప‌టికీ మా భ‌వన నిర్మాణానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతూనే ఉన్నాయ‌ని చెప్పారు.