స్పెష‌ల్ ఒలింపిక్స్‌.. భార‌త్ త‌ర‌పున సోనూసూద్..

61
Sonu Sood

బాలీవుడ్ స్టార్ సోనూసూద్‌కు మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కింది. వ‌చ్చే ఏడాది ర‌ష్యాలో జ‌ర‌గ‌బోయే స్పెష‌ల్ ఒలింపిక్స్ వ‌రల్డ్ వింట‌ర్ గేమ్స్‌కు భార‌త్ త‌ర‌పున సోనూసూద్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఎంపిక‌య్యారు. ఈ వింటర్ ఒలింపిక్స్‌కు హాజరయ్యే భారతదేశం అథ్లెట్ల బృందానికి సోనూ సూద్‌ లీడ్‌ చేయనున్నారు. ఇది త‌న‌కెంతో ప్ర‌త్యేక‌మ‌ని, స్పెష‌ల్ ఒలింపిక్స్ భార‌త్ జ‌ట్టు త‌ర‌పున చేరినందుకు ఆనందంగా, గ‌ర్వంగా ఉంద‌ని సోనూసూద్ తెలియ‌జేస్తూ ట్వీట్ చేశారు సోనూసూద్‌.

సోనూ సూద్ ఇటీవల భారతదేశ ప్రత్యేక అథ్లెట్లు, అధికారులతో వర్చువల్ సంభాషణలో లీడ్‌ చేసే విషయాన్ని ప్రకటించారు. ‘స్పెషల్ ఒలింపిక్స్‌కు ఇండియా అథ్లెట్లు చేస్తున్న ప్రయాణంలో నేనూ భాగస్వామిని అవుతున్నందుకు సంతోషంగా ఉన్నది. ఈ కుటుంబంలో చేరడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ప్లాట్‌ఫామ్‌ని మరింత పెద్దదిగా చేస్తానని కూడా వాగ్దానం చేస్తున్నాను’ అని సోనూ సూద్‌ చెప్పారు. అథ్లెట్లు దీనికి ‘స్పెషల్ ఒలింపిక్స్ ఆసియా పసిఫిక్ రీజియన్ ఇనిషియేటివ్‌’ అని కూడా పేరు పెట్టారు. ‘వాక్ ఫర్ ఇన్‌క్లూజన్’ కు పరిచయం చేశారు.