మంత్రి విన్నపంపై సీఎం కేసీఆర్ సానుకూల స్పందన..

65

నిర్మల్ జిల్లాలోని గుండెగావ్ పునరావాసానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశించారు. నిన్న రాత్రి క్యాబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మరియు ముధోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి కలిసారు. గుండె గావ్ పునరావాస సమస్య పరిష్కరించాలని విన్నవించారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సానుకూలంగా స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.