మంత్రి ఎర్రబెల్లిని కలిసిన అల్లు అరవింద్..

49
Minister Errabelli

సోమవారం హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో మంత్రుల క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడెళ్ళ కాలంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ గణనీయంగా అభివృద్ధి చెందిందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో చలనచిత్ర రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళల సహాయ, సహకారాలు అందజేస్తున్నదని ఆయన తెలిపారు.