అసమ్మతి నేతలతో ముగిసిన సోనియా భేటీ..

153
soniya
- Advertisement -

ఢిల్లీలో శనివారం కాంగ్రెస్‌ పార్టీ అధినేత సోనియా గాంధీ అసమ్మతి నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశం కొద్దిసేపటిక్రితమే ముగిసింది. ఈ సమావేశంలో సోనియాకు నమ్మకస్తులైన ఏకే ఆంటోనీ, అశోక్ గెహ్లాట్, అంబికా సోనీలతో పాటు అసమ్మతి నేతలైన గులాం నబీ అజాద్, వివేక టంకా, ఆనంద్ శర్మ, శశి థరూర్, మనీశ్ తివారీ, భూపీందర్ సింగ్ హుడా తదితరులు హాజరయ్యారు. పి. చిదంబరం కూడా సమావేశానికి వచ్చారు. దాదాపు 5 గంటలపాటు ఈ సమావేశం కొనసాగినట్లు సమాచారం.

సమావేశంలో పాల్గొన్న 19 మంది నేతల అభిప్రాయాలు సోనియా అడిగి తెలుసుకున్నారు.నేతలు పార్టీ బలోపేతంపై తమ అభిప్రాయాలు వెల్లడించారు. నాయకులందరూ పార్టీ కుటుంబ సభ్యులే అని సోనియా చెప్పారు. ఈ భేటీలో పార్టీని బలోపేతం చేసే అంశాలపై రాహూల్ గాంధీ ప్రసంగించారు. రాహుల్ నాయకత్వంపై ఎవరికీ అభ్యంతరం లేదని నేతలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో పార్టీ విధివిధానాలపై నేతలతో మరి కొంత కాలం పాటు మంతనాలు కొనసాగనున్నట్లు తెలుస్తోంది.

ఈ సమావేశంలో చింతన్ శిబిర్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయి చర్చ జరపాలని కొందరు నేతలు కోరారు. పార్టీని బలోపేతం చేయడం కోసం సూచనలు, సలహాలు స్వీకరించిన అధినాయకత్వం..వివిధ రాష్ట్రాలలో పార్టీ పరిస్థితులపై కూడా చర్చింది. పిసిసి ల మార్పు, పార్టీ సంస్థాగత ఎన్నికల తదితర అంశాలపై కూలంకుశంగా చర్చ జరిగింది. కాగా గత ఎన్నికల్లో బీహార్‌లో పార్టీ ఓడిపోవడానికి గల కారణాలపై చర్చించారు సోనియా.

- Advertisement -