- Advertisement -
కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారం ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు డాక్టర్లు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు ఆసుపత్రి ఛైర్మన్ అజయ్ స్వరూప్.
ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు సోనియా. ఈ నెల 9వ తేదీన ఇదే ఆస్పత్రిలో సోనియా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అధిక రక్తపోటుతో బాధపడుతున్న సోనియా గాంధీకి వైద్యులు చికిత్స అందించారు.
Also Read:జనగణన.. నోటిఫికేషన్ జారీ
- Advertisement -

