ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సైప్రస్ అత్యున్నత పురస్కారంతో సత్కరించారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ఇవాళ సైప్రస్‌లో పర్యటిస్తున్నారు మోదీ. ఈ నేపథ్యంలో మోదీకి సైప్రస్ అత్యున్నత పురస్కారం ఇవ్వగా అవార్డును ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహానికి అంకితం ఇస్తున్నట్టు ప్రకటించారు మోదీ.
ఇది నరేంద్ర మోదీకి మాత్రమే గౌరవం కాదు, ఇది 140 కోట్ల భారతీయులకు గౌరవం. ఇది వారి సామర్థ్యం, ఆశయాలకు గౌరవం. ఇది మన సంస్కృతి, సోదరభావం మరియు ‘వసుధైవ కుటుంబకం’ అనే సిద్ధాంతానికి దక్కిన గౌరవం అన్నారు.
ఈ గౌరవాన్ని భారతదేశం మరియు సైప్రస్ మధ్య స్నేహపూర్వక సంబంధాలు, మన సంయుక్త విలువలు మరియు పరస్పర అవగాహనకు అంకితం చేస్తున్నాను. అన్ని భారతీయుల తరపున ఈ గౌరవాన్ని నేను ఎంతో వినయంతో మరియు కృతజ్ఞతతో స్వీకరిస్తున్నాను. ఈ బహుమతి శాంతి, భద్రత, సార్వభౌమత్వం, ప్రాంతీయ సమగ్రత మరియు మన ప్రజల పట్ల మన అచంచల నిబద్ధతకు ప్రాతినిధ్యం వహిస్తుంది అని చెప్పారు.
Also Read:జనగణన.. నోటిఫికేషన్ జారీ

