మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీపై కేసు నమోదు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు సోనియా గాంధీకి, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
ఢిల్లీకి చెందిన ఓ న్యాయవాది, సోనియా గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం అవసరం లేదని స్పష్టంగా పేర్కొన్న మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ ప్రకారం, సోనియా గాంధీ భారత పౌరసత్వం పొందే మూడు సంవత్సరాల ముందే ఆమె పేరు ఓటర్ జాబితాలో చేరిందని ఆరోపిస్తోంది.
పౌరసత్వం లేని సమయంలోనే ఆమె పేరు ఓటర్ రోల్‌లో చేరిందన్న ఆరోపణలపై దాఖలైన రివిజన్ పిటిషన్‌కు సంబంధించి కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది. సోనియా గాంధీని, ఢిల్లీ పోలీసుల నుంచి వివరణలను కోరిన న్యాయస్థానం.. తదుపరి విచారణ జనవరి 6, 2026కు వాయిదా పడింది. ఈ పిటిషన్‌ను న్యాయవాది వికాస్ త్రిపాఠి దాఖలు చేశారు.
సోనియా గాంధీ పేరు 1980 ఓటర్ లిస్ట్లో ఉందని, అయితే ఆమె అధికారికంగా భారత పౌరసత్వం పొందింది ఏప్రిల్ 30, 1983న. పౌరసత్వం లేని ఆమె పేరు 1980 ఎన్నికల జాబితాలో ఎలా నమోదైందని పిటిషన్ ప్రశ్నిస్తోంది. ఇది మాత్రమే కాకుండా, 1982లో ఆమె పేరు ఓటర్ జాబితా నుంచి తొలగించబడిన విషయాన్ని కూడా పిటిషన్ పేర్కొంది. 1980లో ఓటర్ రోల్‌లో చేర్చేందుకు ఏ పత్రాలు సమర్పించారో, తప్పుడు లేదా నకిలీ పత్రాలు వాడారా అన్న అనుమానాలను కూడా పిటిషన్ లేవనెత్తుతోంది. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఈ పిటిషన్‌ను సెప్టెంబర్ 2025లో కొట్టివేయగా, ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ప్రస్తుత రివిజన్ పిటిషన్ దాఖలైంది.
Also Read:అమెరికా పర్యటనలో లోకేష్ బిజీ బిజీ..

