ఏపీ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనలో తన అజెండాను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా ఆయన పర్యటన బిజీ షెడ్యూల్‌తో కొనసాగుతోంది. శాన్ ఫ్రాన్సిస్కోలో ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో లోకేష్ వరుసగా సమావేశాలు నిర్వహించారు.
సెలెస్టా వీసీ మేనేజింగ్ పార్టనర్ అరుణ్ కుమార్, కాన్వా చీఫ్ కస్టమర్ సక్సెస్ ఆఫీసర్ రోబ్ గిగిలియో, అలాగే ఎడ్యుకేషన్ మరియు పబ్లిక్ సెక్టార్ హెడ్ జాసన్ విల్ మాట్‌లతో మంత్రి లోకేష్ ప్రత్యేకంగా మాట్లాడారు. ఏపీ ఐటీ రంగంలో వేగంగా ఎదుగుతోందని, ముఖ్యంగా విశాఖపట్నం ఐటీ, డేటా హబ్‌గా దేశంలో ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్నదని లోకేష్ వివరించారు.
రాష్ట్రంలో డీప్ టెక్ ఇన్నోవేషన్ హబ్‌ను ఏర్పాటు చేయాలని సెలెస్టా వీసీకి ఆయన ప్రతిపాదించారు. సెమీ కండక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో పెట్టుబడులకు ఏపీలో అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దీనిపై అరుణ్ కుమార్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
అదే విధంగా, అమరావతిలో ఎంటర్టైన్‌మెంట్ సిటీ అభివృద్ధి జరుగుతోందని, రాష్ట్రం క్రియేటివ్ ఎకానమీ వైపు దూసుకెళ్తుందని లోకేష్ వెల్లడించారు. అమరావతి క్రియేటివ్ ల్యాండ్ ప్రాజెక్ట్‌లో శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కోసం క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో కలిసి పనిచేయాలని రోబ్ గిగిలియోను కూడా కోరారు.
లోకేష్ అమెరికా పర్యటనలో భాగంగా మరికొన్ని కీలక సమావేశాలు కూడా ఉండనున్నాయి. ఏపీకి పెట్టుబడులు, కొత్త అవకాశాలు తీసుకురావాలనే లక్ష్యంతో ఈ టూర్ కీలక మైలురాయిగా భావిస్తున్నారు.
Also Read:TG:ఇంటర్ పరీక్షల షెడ్యూల్ 2026 విడుదల..

