కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమెకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది.
ఆస్పత్రి వర్గాల సమాచారం ప్రకారం, ప్రముఖ వైద్యుడు డా అనూప్ బసు నేతృత్వంలోని ప్రత్యేక బృందం సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తూ అవసరమైన చికిత్స అందిస్తోంది. ఆమె ఆరోగ్య స్థితి స్థిరంగా ఉందని, వైద్యులు నిరంతరం మానిటరింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సమయంలో ఆమె వెంట కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సోనియా గాంధీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆమె అభిమానులు, శ్రేయోభిలాషులు కూడా ఆమె ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థనలు చేస్తున్నారు.
Also Read:KTR:డీలిమిటేషన్‌ను స్వాగతిస్తున్నాం..కానీ!

