దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు!

5
- Advertisement -

దేశంలో పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశంలో అవసరానికి సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయు శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సరఫరా సాధారణంగా కొనసాగుతోందని తెలిపారు. సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని ఆమె వివరించారు.

ఇటీవల కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ కొరత వస్తుందనే అపోహలతో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద పెద్ద ఎత్తున క్యూలు కడుతున్నారు. అయితే ఈ పరిస్థితి పూర్తిగా అపోహల వల్లేనని అధికారులు చెబుతున్నారు. అనవసరంగా నిల్వలు చేసుకోవడం వల్లే తాత్కాలిక ఒత్తిడి ఏర్పడుతుందని సూచించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన సందేశం ఇస్తూ, భయపడకుండా సాధారణంగా ఇంధనం వినియోగించుకోవాలని కోరింది. సరఫరా వ్యవస్థ సక్రమంగా పనిచేస్తోందని, దేశంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదని మరోసారి హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో వాహనదారులు అపోహలకు లోనవకుండా, ప్రభుత్వ ప్రకటనలను నమ్మాలని అధికారులు సూచిస్తున్నారు.

Also Read:KTR:డీలిమిటేషన్‌ను స్వాగతిస్తున్నాం..కానీ!

- Advertisement -