శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో RC15 గా తెరకెక్కుతున్న ఏ ఏసినిమాకు సంబందించి బ్రేకులతో షూటింగ్ జరుగుతుంది. రామ్ చరణ్ RRR అవార్డ్స్ కోసం అమెరికా వెళ్ళడం , మధ్యలో శంకర్ భారతీయుడు 2 షూటింగ్ కూడా చేస్తుండటంతో ఈ షూటింగ్ నత్తనడకన సాగుతుంది.
అయితే కొన్ని నెలలుగా బ్రేక్ తీసుకున్న యూనిట్ ఈరోజు నుండి సాంగ్ ఘాట్ తో షెడ్యూల్ స్టార్ట్ చేశారు. హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఈ సినిమా సాంగ్ ఘాట్ జరుగుతుంది. ప్రభుదేవా మాస్టర్ ఈ సాంగ్ కంపోజ్ చేస్తున్నాడని సమాచారం. తమన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ తో శంకర్ సినిమాకు సంబంధించి కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసి రంగంలోకి దిగాడు చరణ్.
ఇకపై కంటిన్యూ గా ఘాట్ చేసే ప్లానింగ జరుగుతుంది. శంకర్ భారతీయుడు 2 షూటింగ్ వెళ్ళినప్పుడు మాత్రమే ఈ షూటింగ్ కి బ్రేక్ పడనుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కి ఈ సినిమాను థియేటర్స్ లోకి తీసుకురావాలని దిల్ రాజు భావిస్తున్నాడు. త్వరలోనే చరణ్ స్టిల్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. చరణ్ సరసన కీయరా అద్వానీ , అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ , ఎస్ జె సూర్య , సునీల్ , నవీన్ చంద్ర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి…

